కాకమ్మ, పిట్టమ్మ కధ

ఒక్క ఉళ్లో కాకమ్మ, పిట్టమ్మ అని రెండు పక్షులు ఉండేవి. అవి మంచి మిత్రులు. అవి పక్క పక్క చెట్ల మీద వాటి గూళ్ళు కట్టుకుని, వాటిల్లో నివసించేవి. పిట్టమ్మకు ఇద్దరు పిల్లలు. కాకమ్మ మాత్రం తన గూళ్ల్ల్లో ఒక్కతే ఉండేది. ఒక్క రోజు సాయంత్రం జొరున వాన, పెద్ద గలి వీయడము మొదలైంది.  ఉరుములు, మెరుపులతో ఊరంత గజగజ వణికింది. విపరీతమైన వాతావరణం లో కాకమ్మ గూడు కొట్టుకుపోయింది. ఒంటరిదైన కాకమ్మ భయంతో పిట్టమ్మ గూటికి చేరింది.
"
పిట్టమ్మ, పిట్టమ్మ! ఒక్క సారి తలుపు తీయమ్మ", అంది.
"
ఆగమ్మ కాకమ్మ, నా పిల్లలకు స్నానం చేయిస్తూన" అంది ఓర్పుగా.
కొది సేపు తర్వాత, కాకమ్మ మళ్ళీ పిలిచింది. "పిట్టమ్మ, పిట్టమ్మ! కాస్త తలుపు తెరువారదు!"
"
ఆగమ్మ, నా పిల్లల్ని ముస్తాబు చేస్తున" అంది. బయట వర్షం కురుస్తూనే ఉంది.
రెండు నిమిషాల తర్వాత, కాకమ్మ మళ్ళీ పిలువా సాగింది, "పిట్టమ్మ, పిట్టమ్మ! ఇంకా ఎంత సేపమ్మ?"
"
ఆగమ్మ కాకమ్మ, నా పిల్లలను పడుకోబేడుతూన" అంది, సారి విస్సుగా.
కాకమ్మ ఆత్రం గా ఆశ తో, సారి మళ్లీ కేక వేసింది, "పిట్టమ్మ, పిట్టమ్మ! ఇప్పుడైన తలుపు తీయమ్మ."
"
ఆగమ్మ, వస్తునా!", అంటూనే పిట్టమ్మ తలుపు తీసింది.
తన బాధంత పిట్టమ్మ తో చెప్పుకొని, తాను రాత్రి వాళ్లింట్లోనే ఉండొచా అని బ్రతిమాలింది కాకమ్మ. తన మీద జాలితో, వారి మధ్య గల స్నేహం తో, తన ఇంట్లో ఎక్కువ స్థానం లేకపోయినా పిట్టమ్మ సరేనంది. తమ గూల్ళ్లో పైన అటక మీద ఉన పుట్నాల గంపలను సర్ది, కాకమ్మ కు చోటు చేసింది.
తెల్లవారు జామున లేచిన పిట్టమ్మ, తన యాదవిది లోకి జారిపోయింది. కాసేపైన తర్వాత, పడుకున కాకమ్మను నిద్ర లేపుడానామని అటక పైకి ఎక్కింది. అక్కడ కాకమ్మ లేదు, పుట్నాలు లేవు. నోరు ఎళ్ళబెట్టుకుని చూస్తున పిట్టమ్మ, దగ్గరగా వెళ్ళి చూసింది. అక్కడ పుట్నాల గంపల్లో చిన్న చిన్న పప్పులాగా ఏవో కనిపించాయి. సారి కళ్ళు అప్పగించి చూస్తున పిట్టమ్మ చూస్తూనే ఉండిపోయింది. రాత్రి పడుకోడానికి వచ్చిన కాకమ్మ కడుపు నింపుకొని, కాళ్లీ చేసుకొని, కునుకు తీసి మరీ ఇవ్వనీ అతిధ్యం స్వీకరించింది.
పిట్టమ్మ ముక్కున వేలేసి, నాలుక కారుచుకొని శూన్యం లోకి చూస్తూ ఫక్కున నవ్వింది.